‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on Feb 24, 2024 1:00 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా గ్రాండ్ లెవెల్లో శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు, హిందీ బైలింగువల్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచింది ఈ మూవీ. ఈ ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 25న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గం. ల నుండి గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థలు ఆపరేషన్ వాలెంటైన్ ని భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ మార్చి 1న తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు