ఫుల్ స్వింగ్ లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్

ఫుల్ స్వింగ్ లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్

Published on Feb 23, 2024 12:56 AM IST

వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న గ్రాండ్ గా తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. సోనీ పిక్చర్స్, రెనైసన్స్ పిక్చర్స్ కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ తప్పకుండా విజయం సాదిస్తుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విషయం ఏమిటంటే, తమ మూవీని అటు హిందీతో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా మరింతగా చేరువ చేసేందుకు హీరో వరుణ్, హీరోయిన్ మానుషీ విరివిగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో టూర్ చేస్తోంది టీమ్. మరి ఈ మూవీతో వరుణ్ తేజ్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు