‘ఆపరేషన్ వాలెంటైన్’ : మంచి రెస్పాన్స్ అందుకుంటున్న స్పెషల్ ప్రీమియర్స్

‘ఆపరేషన్ వాలెంటైన్’ : మంచి రెస్పాన్స్ అందుకుంటున్న స్పెషల్ ప్రీమియర్స్

Published on Mar 1, 2024 12:49 AM IST

యువ నటుడు వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ రేపు గ్రాండ్ లెవెల్లో తెలుగు, హిందీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించగా మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి.

ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క స్పెషల్ ప్రీమియర్స్ పలు ప్రాంతాల్లో నేడు ప్రదర్శించగా వాటికీ మంచి రెస్పాన్స్ లభించిందని, అలానే రేపు ఆడియన్స్ ముందుకి రానున్న తమ మూవీ తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుందని అంటున్నారు మేకర్స్. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీకి హరి కె వేదాంతం ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు