‘ఆపరేషన్ వాలెంటైన్’ : మూవీలో అవే మెయిన్ హైలైట్ అట ?

‘ఆపరేషన్ వాలెంటైన్’ : మూవీలో అవే మెయిన్ హైలైట్ అట ?

Published on Feb 29, 2024 2:01 AM IST

యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మెగా ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ బైలింగువల్ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించారు.

విషయం ఏమిటంటే, మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో ఏరియల్ యాక్షన్ సీన్స్ తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు ఎమోషనల్ సీన్స్ ఎంతో కనెక్ట్ అవుతాయట. ఇవి హైలైట్ గా నిలవడంతో పాటు మొత్తం మూవీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. మరి రేపు ఆడియన్స్ ముందుకి రానున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఎంతమేరకు ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు