“ఆపరేషన్ వాలెంటైన్” ఓటిటి రిలీజ్ టైమ్ పై క్లారిటీ!

“ఆపరేషన్ వాలెంటైన్” ఓటిటి రిలీజ్ టైమ్ పై క్లారిటీ!

Published on Feb 28, 2024 5:10 PM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 1, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ఏమిటంటే, ఆపరేషన్ వాలెంటైన్ యొక్క తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత OTT లోకి రానుంది. అయితే హిందీ వెర్షన్ ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలోకి రానుంది. అంతేకాక, ఈ చిత్రం కన్నడ, మలయాళం మరియు తమిళ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. నవదీప్, రుహానీ శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు