ఆ లెజెండరీ క్రికెటర్ సంతకం చేసిన బ్యాట్ కు అంత ధరా..!

ఆ లెజెండరీ క్రికెటర్ సంతకం చేసిన బ్యాట్ కు అంత ధరా..!

Published on Jul 6, 2019 8:09 AM IST

అమెరికాలో ఉండే తెలుగువారు ప్రతి ఏటా నిర్వహించే తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా, తానా వేడుకలు వాషింగ్టన్ డి సి లో ఘనంగా జరగుతున్నాయి. ఈనెల 4న ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కళా,రాజకీయ,సినీ,క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సారి ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరో విశేషం ఏమిటంటే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాగా తానా ముఖ్య నిర్వాహకులు ఆయనను సత్కరించారు. ఈ సంధర్బంగా ఆయన సంతకం చేసిన బ్యాట్ ని ఒక తెలుగు ఎన్ ఆర్ ఐ వేలంలో 25వేల డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా 17.5 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. దీనితో భారత్ కు మొదటి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ కపిల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు