ఇండియాలో “ఓపెన్ హైమర్” ఓటిటి రిలీజ్ డేట్ లాక్.!

ఇండియాలో “ఓపెన్ హైమర్” ఓటిటి రిలీజ్ డేట్ లాక్.!

Published on Feb 21, 2024 1:00 PM IST

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కోసం మన ఇండియన్ సినిమా ఆడియెన్స్ కి కూడా చాలా బాగా తెలుసు. మరి తన నుంచి వచ్చిన చిత్రాల్లో చాలానే ఇండియాలో కూడా రిలీజ్ అయ్యాయి. అలా రీసెంట్ గా వచ్చిన భారీ చిత్రమే “ఓపెన్ హైమర్”. అణుబాంబు ని కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా పీకీ బ్లైండర్స్ ఫేమ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రం మూవీ లవర్స్ మంచి ఫీస్ట్ ని ఇచ్చింది.

మరి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళని కూడా రాబట్టిన ఈ చిత్రం ఇండియాలో అయితే ఇంకా ఫ్రీ గా చూసేందుకు ఓటిటి రిలీజ్ కి రాలేదు. మరి ఫైనల్ గా ఇప్పుడు అందుకు సమయం దగ్గర పడింది. ఇండియా వెర్షన్ అది కూడా ఫ్రీ స్ట్రీమింగ్ హక్కులు జియో సినిమా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈ వచ్చే మార్చ్ 21 నుంచి అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ ఎమోషనల్ ఫీస్ట్ ని చూడాలి అనుకుంటే జియో సినిమా సబ్ స్క్రైబర్స్ అప్పుడు వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు