ఫస్ట్ లుక్ తో ‘ఒరేయ్ బామ్మర్ది’ !

ఫస్ట్ లుక్ తో ‘ఒరేయ్ బామ్మర్ది’ !

Published on Apr 5, 2021 6:20 PM IST

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’.. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ లు పోటాపోటీగా నటించారు.

వీరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు