వరల్డ్ సినిమా దగ్గర క్రియేటర్స్ తమ లైఫ్ టైం లో ఒక్కసారైనా గెలుపొందాలి అని భావించే అత్యత్తమ అవార్డు ఏదన్నా ఉంది అంటే అది ఆస్కార్ అవార్డ్ అనే చెప్పొచ్చు. అయితే వరల్డ్ సినిమా దగ్గర అనేక క్యాటగిరీ లలో అకాడమీ అవార్డులు అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో సినిమా కంటెంట్ క్రియేటర్స్ కి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి సవాలు విసిరిందో అందరికీ తెలిసిందే.
అయితే ఇది పని సులువు చేసినప్పటికీ మనిషి చేసే పనితనం మాత్రం ఇది చేసినట్టు కాదు. పైగా విజువల్స్ కూడా క్లియర్ గా మనకి తెలిసిపోతాయి, ఏది ఏఐ తో చేసింది ఏది కంప్యూటర్ విజువల్స్ అని. ఇలా సినిమాల విషయంలో ఏఐ ప్రభావం పట్ల ఆస్కార్స్ కొత్త రూల్ కంటెంట్ క్రియేటర్స్ కి ఊరట కలిగించింది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకే దేశం నుంచి ఒకేసారి ఎన్ని సినిమాలు అయినా పోటీకి ఉండొచ్చు అని తెలిపారు.
అలానే ఒకే నటుడు ఒకేసారి ఎన్ని సినిమాలు నుంచి అయినా ఒకే క్యాటగిరీలో నామినేట్ కావచ్చట. అయితే వీటి అన్నిటిలో మాత్రం ఏఐ విషయంలో విధించిన బ్యాన్ మాత్రం చాలామందికి కనెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంప్ట్ లు ఇచ్చి కోట్ల ఖర్చు సినిమాలని యిట్టె తీసేస్తున్నారు. దీనితో రియల్ కంటెంట్ క్రియేటర్స్ కి అది పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని అకాడమీ వారు ఇప్పుడు నిషేధం చేయడం మాత్రం మంచి స్టెప్ గా భావిస్తున్నారు. అలాగే ఇది 2027 నుంచి జరగనున్న 99వ అకాడమీ అవార్డ్స్ నుంచే అమలు కానుంది అట.
