రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రమే ‘చెన్నై లవ్ స్టోరీ’. జాతీయ అవార్డు దర్శకుడు, రచయిత సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్ హిట్ అయ్యింది.
ఇలా థియేటర్స్ లో అద్భుతంగా రాణించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ ఆగష్టు 21 నుంచే అందుబాటులోకి రానున్నట్టు ఇప్పుడు ప్రకటించారు. ఈ చిత్రం ఆరోజు నుంచి తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఇక ఓటిటి లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా సాయి రాజేష్ తో పాటుగా ఎస్ కే ఎన్ కూడా నిర్మాణం వహించారు.
