ఓటిటిలో ఇక నుంచి ఈ ఫార్మాట్ లో కూడా సినిమాలు?

ఓటిటిలో ఇక నుంచి ఈ ఫార్మాట్ లో కూడా సినిమాలు?

Published on May 27, 2024 7:28 PM IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి కంటెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూస్తూనే ఉన్నాం. అనేక భాషల్లో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కంటెంట్ అందుబాటులో ఉంది. మరి ఈ క్రమంలో ఓటిటి కంటెంట్ అన్ని వర్గాల ఆడియెన్స్ కి వినోదం అందించేలా మాత్రం కొంతమేరకే ఉందని చెప్పాలి. అంటే చూడడం, వినడం ద్వారా సాధారణ మనుషులకి ఆ ఎక్స్ పీరియన్స్ అర్ధం అవుతుంది.

కానీ కొందరు ఫిజికల్లీ ఛాలెంజెడ్ వినికిడి, మాట లోపం ఉన్న వారికి కూడా ఇక నుంచి ఓటిటి లో కంటెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తుంది. ఇది బహుశా మన దేశంలోనే సాధ్యం అవ్వొచ్చని టాక్. రీసెంట్ గానే మాస్ మహారాజ రవితేజ (Raviteja) నటించిన “టైగర్ నాగేశ్వరరావు” చిత్రం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

అయితే ఇది ఒక వినూత్న ప్రయత్నం కాగా మరి ఈ ఫార్మాట్ లో మరిన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇది ఒక మంచి ప్రయత్నమే కానీ ఎంతమేరకు మేకర్స్ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు