తన ఓటిటి సెన్సేషన్ ‘దూత 2’ పై చైతు బిగ్ అప్డేట్.. కొత్త స్టెప్ కూడా దీనితోనే!

తన ఓటిటి సెన్సేషన్ ‘దూత 2’ పై చైతు బిగ్ అప్డేట్.. కొత్త స్టెప్ కూడా దీనితోనే!

Published on Jun 5, 2026 2:50 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన అక్కినేని నాగ చైతన్య తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ తర్వాత ఓటిటిపై కూడా కొన్నాళ్ల కితం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ అక్కినేని కుటుంబానికి ఆస్థాన దర్శకుడు లాంటి విక్రమ్ కె కుమార్ తో చేసిన ‘దూత’ అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యి తన సాలిడ్ డెబ్యూగా నిలిచింది.

అయితే దూత సీక్వెల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయగా ఇపుడు దీనిపై నాగ చైతన్య బిగ్ అప్డేట్ ని అందించాడు. కింగ్ నాగార్జున క్లాప్ తో దూత సీజన్ 2 ని ఇప్పుడు మొదలు పెట్టినట్టు చైతు కన్ఫర్మ్ చేసాడు. అంతే కాకుండా ఇదే సిరీస్ కి తాను నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా కొత్త స్టెప్ తీసుకుంటున్నట్టు నాగ చైతన్య రివీల్ చేయడం మరింత ఎగ్జైటింగ్ గా మారింది. ఇక ఈసారి సీజన్ లో విక్రమ్ కే కుమార్ ఏం ప్లాన్ చేసారో చూడాల్సిందే. ప్రస్తుతం చైతు తన ‘వృషకర్మ’ అనే భారీ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దాని తర్వాత దూత 2 లో ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగనున్నాడు.

తాజా వార్తలు