ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!

వరల్డ్ వైడ్ గా మంచి పాపులర్ అయ్యినటువంటి టాప్ మోస్ట్ ఓటిటిలలో నెట్ ఫ్లిక్స్ కోసం అందరికీ తెలిసిందే. అయితే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యిన పలు గ్లోబల్ హిట్ సిరీస్ లలో స్పానిష్ వెబ్ సిరీస్ లకసా డీ పాపెల్ ఇంగ్లీష్ లో మనీ హెయిస్ట్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే ఈ సెన్సేషనల్ హిట్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ మొత్తం 5 సీజన్స్ గా తెరకెక్కించి ముగించేశారు.

కానీ ఈ సిరీస్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్ ని నెట్ ఫ్లిక్స్ రీసెంట్ గా అందించడం మళ్ళీ ఫ్యాన్స్ కి కొత్త ఊపుని తీసుకొచ్చింది. ఓ క్రేజీ ప్రోమో కట్ తో వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్ అంటూ ఇంకా ముగిసిపోలేదు అని సాలిడ్ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనితో సిరీస్ హీరో ప్రొఫెసర్ అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఈ అవైటెడ్ సిరీస్ ని మొదలు పెట్టగా కొన్నాళ్ల తర్వాత స్ట్రీమింగ్ కి రానుంది. ఇక ఇదిలా ఉండగా దీనికి లింక్ ఉన్న మరో సిరీస్ బెర్లిన్ సీజన్ 2 ఈ మే 15న స్ట్రీమింగ్ కి రానుంది.

Exit mobile version