ఓటిటి పార్ట్నర్, రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “బాహుబలి” కొత్త సిరీస్

ఓటిటి పార్ట్నర్, రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “బాహుబలి” కొత్త సిరీస్

Published on May 2, 2024 4:00 PM IST

ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “బాహుబలి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) కలయికలో వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఒక ట్రేడ్ మార్క్ ని సెట్ చేసుకుంది. అయితే ఈ సెన్సేషనల్ పాత్ర నేపథ్యంపై దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి యానిమేటెడ్ సిరీస్ “బాహుబలి – క్రౌన్ ఆఫ్ బ్లడ్” వస్తున్నట్టుగా అఫీషియల్ గా అప్డేట్ అందించిన సంగతి తెలిసిందే.

అయితే అది డేట్ ఎప్పుడు ఓటిటి పార్ట్నర్ ఏంటి అనేది రివీల్ కాలేదు. మరి ఇపుడు దీనిపై ఫైనల్ గా అప్డేట్ వచ్చేసింది. ఈ సిరీస్ ని డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సిరీస్ ఈ మే 17న రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మాహిస్మతి సామ్రాజ్యంలో కొత్త కోణంతో ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఇది ఆసక్తిగా ఉంది. మరి ఈ సిరీస్ ని రాజమౌళి, శరద్ దేవరాజన్ లు క్రియేట్ చేయగా ఇప్పుడు సిరీస్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు