అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఓటీటీ పార్ట్నర్ లాక్!

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఓటీటీ పార్ట్నర్ లాక్!

Published on Sep 4, 2026 11:00 AM IST

ఈ వారం థియేటర్స్ లో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో టాలీవుడ్ స్టార్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ హీరోగా సురభి హీరోయిన్ గా దర్శకుడు చంద్రమోహన్ చింతాడ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక కూడా ఒకటి. విడుదలకి ముందు అల్లరి నరేష్ చాలా కాన్ఫిడెన్స్ ని ఈ సినిమా విషయంలో చూపించారు. అయితే ఈ సినిమా నేడు థియేటర్స్ లోకి వచ్చింది.

ఇక థియేట్రికల్ విడుదల తర్వాత ఏ ఓటీటీలో ఈ సినిమా వస్తుంది అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నారు. సో ఈ సినిమా కొన్ని వారాల తర్వాత ఈ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా రాజేష్ దండ, నిమ్మకాయ ప్రసాద్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు