పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా రాకా కోసం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ రెండు భాగాల సినిమా ప్రస్తుతం షూటింగ్ లోనే బిజీగా ఉంది. అయితే ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా విడుదల చాలా ఆలస్యంగా ఉంటుంది అని ఓ క్లారిటీ అభిమానుల్లో ఉంది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో రాకా అఫీషియల్ ఖాతా నుంచి సినిమా విడుదల తేది బయటకి వచ్చి వైరల్ గా మారింది. ఏకంగా డిసెంబర్ 31 విడుదల తేది అంటూ రాకా విడుదల తేది ఇందులో రివీల్ చేశారు. అయితే చాలా మంది ఇదే నిజం అనుకోని షాక్ అవుతున్నారు.
కానీ ఇక్కడ అసలు క్లారిటీ ఏమిటంటే ఈ వైరల్ అవుతున్న డేట్ గాని ఆ హ్యాండిల్ రెండూ ఫేకే. సో రాకా విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


