ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “సుందరం మాస్టర్”

ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “సుందరం మాస్టర్”

Published on Mar 24, 2024 11:10 AM IST


యూట్యూబ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు హర్ష చెముడు(వైవా హర్ష) ప్రధాన పాత్రలో డెబ్యూ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “సుందరం మాస్టర్”. మరి మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజం చేత ఆశీస్సులు పొంది ఈ మార్చ్ లోనే రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ ని అందుకొని మంచి డెబ్యూ గా దర్శకుడు మరియు హీరోకి నిలిచింది.

అయితే ఇపుడు ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మార్చ్ 28 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. మరి ఈ చిత్రాన్ని చూడాలి అంటే అపుడు ఆగాలి. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా మాస్ మాస్ మహారాజ్ రవితేజ నిర్మాణం వహించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు