ఓటిటి రివ్యూ : ‘భాగ్ బీని భాగ్’ – హిందీ సిరీస్ నెట్ ప్లిక్స్ లో ప్రసారం

ఓటిటి రివ్యూ : ‘భాగ్ బీని భాగ్’ – హిందీ సిరీస్ నెట్ ప్లిక్స్ లో ప్రసారం

Published on Dec 14, 2020 8:01 PM IST

నటీనటులు : స్వరా భాస్కర్, ఆదిత్య బెల్నెకర్, హెట్వి కరియా తదితరులు

దర్శకత్వం : శిశిర్ అద్మానే, రోహిత్ బాబు, ముఖేష్ పాండే, ఆరాధిత శర్మ

నిర్మాతలు : డేవిడ్ బెర్నాడ్, రూబెన్ ఫ్లీషర్, డోరిస్ జార్జ్, సెహర్ లతీఫ్, అఫ్తాబ్ ఖురేషి

సినిమాటోగ్రఫీ : మ్రిదుల్ సేన్

 

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా బాలీవుడ్ సిరీస్ ” ‘భాగ్ బీని భాగ్’. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

బీని భట్నాగర్ (స్వరా భాస్కర్) ఒక మధ్యతరగతి అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు ఆమెను పెళ్లి, పిల్లలు అంటూ సాధారణ పనులను చేయమని బలవంతం చేస్తారు. కానీ బీని స్టాండ్-అప్ కమెడియన్ కావాలని ఆశ పడుతూ ఉంటుంది. ఆమె ఆ ప్రయత్నంలో వివిధ షోలను చేస్తుంది, ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం దాన్ని పెద్దదిగా చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో అరుణ్ (వరుణ్ ఠాకూర్) తో ఆమె నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసి, తల్లిదండ్రులకు దూరం జరిగినప్పుడు ఆమె జీవితంలో కొన్ని విషయాలు యు-టర్న్ తీసుకుంటాయి. మరి ఈ ఒంటరి అమ్మాయి ఒక ప్రత్యేకమైన రంగంలో ఎలా విజయం సాధిస్తోంది అనేది మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

ఈ వెబ్ సిరీస్‌లో స్వరా భాస్కర్ ప్రధాన ఆకర్షణ. ఆమె మంచి పాత్రను కలిగి ఉంది మరియు చాలా సహజమైన నటనను కనబర్చింది. ఆమె స్టాండ్ అప్ కామిక్ చర్యలను కూడా బాగా పలికించింది. మొత్తానికి స్వరా తన పాత్రను హృదయపూర్వకంగా పోషించింది, రవి పటేల్, అరుణ్ ఠాకూర్ తమ పాత్రల్లో బాగా నటించారు.

అలాగే స్వరా యొక్క కామిక్ టైమింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సంభాషణలకు ప్రత్యేక ప్రస్తావన అవసరం. డైలాగ్స్ చాల బాగున్నాయి. అలాగే, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను అనుసరించమని బ్లాక్ మెయిల్ చేసే విధానం కూడా బాగుంది. స్వరా తల్లిదండ్రులుగా మోనా అంబేగాంకర్, గిరీష్ కులకర్ణి ఆకట్టుకున్నారు.

 

ఏం బాగాలేదు :

ఈ సిరీస్ ప్రదర్శన బాగున్నా.. సిరీస్ కి పెద్ద లోపం మాత్రం కామెడీనే. టాప్ స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకునే అమ్మాయి గురించి ఒక డ్రామాను చూడటం ప్రారంభించినప్పుడు, కాస్త మంచి కామెడీని ఆశిస్తారు. కానీ సిరీస్‌లో పెద్దగా కామెడీ లేదు. సరదాగా సాగకపోగా కొన్ని చోట్ల కథ బాగా స్లోగా సాగుతూ విసిగిస్తోంది. అనుభవజ్ఞులైన హాస్యనటులు వారి కీలకమైన భాగాలలో క్లిక్ చేయరు.

డైలాగులు కొంతవరకు క్లిక్ అయినప్పటికీ, ప్రధాన సరదా భాగం లేదు. అలాగే, ప్రదర్శన యొక్క భావోద్వేగ అంశం కూడా బాగాలేదు. స్వరాకు పరిస్థితులు చాలా కఠినంగా తయారయ్యాయి, ఆమె జీవితానికి పరిష్కారం కనుగొనడం చాలా కష్టమవుతుంది. ఇది సాధారణ జీవితంలో జరగదు కదా అనిపిస్తోంది. ప్రముఖ హాస్యనటుడు, డాలీ సింగ్ ఈ షోలో అసలు బాగాలేదు. రచన కూడా చాలా బలహీనంగా ఉంది.

 

తీర్పు:

మొత్తం మీద, ‘భాగ్ బీని భాగ్’ అనేది స్టాండ్అప్ కమెడియన్ యొక్క కథ, ఇది సన్నివేశాల పరంగా చూసుకుంటే.. కొన్ని సీన్స్ మాత్రమే మెప్పిస్తాయి. కానీ, సిరీస్ బోర్ గా సాగడం, కామెడీ సిరీస్ అయినా పెద్దగా కామెడీ లేకపోవడం వంటి అంశాలు ఈ సిరీస్ ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే స్వరా భాస్కర్ నటన అద్భుతంగా ఉంది. మీరు టైమ్ పాస్ చేయాలనుకుంటేనే ఈ సిరీస్ ను చూడండి.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు