జియో హాట్‌స్టార్‌కు ‘ధురంధర్ 2’ ఓటీటీ రైట్స్.. మార్పుకు కారణం ఏమిటో..?

జియో హాట్‌స్టార్‌కు ‘ధురంధర్ 2’ ఓటీటీ రైట్స్.. మార్పుకు కారణం ఏమిటో..?

Published on Feb 3, 2026 11:00 AM IST

Dhurandhar 2

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ స్పై చిత్రం ‘ధురంధర్’(Dhurandhar) సృష్టించిన సెన్సేషన్ మనం చూశాం. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘ధురంధర్ 2’(Dhurandhar 2) నుండి టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

అయితే, ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ అయింది. ఈ సీక్వెల్ చిత్ర ఓటీటీ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. దీంతో ధురంధర్ సీక్వెల్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తేలిపోయింది. అయితే తొలి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు సీక్వెల్ ఓటీటీ పార్ట్‌నర్‌ను ఎందుకు మార్చారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ‘ధురంధర్ 2’(Dhurandhar 2) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రామ్‌పాల్, సారా అర్జున్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘ధురంధర్ 2’ చిత్రాన్ని మార్చి 19న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు