మతిమారన్ పుగళంది దర్శకత్వంలో సూరి, సుహాస్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా మందాడి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సూరి కెరీర్‌లోనే ఇది తొలి వంద కోట్ల రూపాయల చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామిగా ఉన్న నెట్ ఫ్లిక్స్, ఈ సినిమాని అక్టోబర్ 8, 2026న తమ ప్లాట్ ఫామ్‌లో విడుదల కానుందని ప్రకటించింది.
తెలుగు మరియు హిందీతో సహా పలు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. మొత్తానికి ఓటీటీ ప్రేక్షకులలో ఈ సినిమాకి విస్తృత ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. నిర్మాతలు ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సత్యరాజ్, మహిమా నంబియార్ కూడా కీలక పాత్రల్లో నటించారు.


