ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న మరో మలయాళ క్రేజీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

Masthishka Maranam

మలయాళంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సై ఫై థ్రిల్లర్ ‘మస్తిష్క మరణం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆర్కే కృష్ణన్ దర్శకత్వంలో ఫిబ్రవరి 27, 2026న విడుదలైన ఈ చిత్రం, తన వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, థియేట్రికల్ రన్‌లో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది.

థియేటర్లలో డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 27, 2026 నుండి ‘మస్తిష్క మరణం’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఈ సినిమాలో రజిషా విజయన్, నిరంజ్ మణియంపిళ్ల రాజు, జగదీష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినాయక అజిత్ నిర్మించిన ఈ చిత్రానికి వర్కీ సంగీతం అందించారు. అయితే, ఈ సినిమా ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ మల్టీ-లాంగ్వేజ్ వెర్షన్లు అందుబాటులోకి వస్తే, ఈ సినిమా రీచ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version