సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ ఒరిజినల్ వెబ్‌సిరీస్ ‘సూపర్ సుబ్బు’. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. జులై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ ప్రసారం కాబోతుంది. అన్నట్టు.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా ‘‘ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం’’ అని ఆ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటికే, విడుదల చేసిన ఈ సిరీస్ ఫస్ట్‌లుక్, టీజర్ బాగున్నాయి. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేలా కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సిరీస్‌ను తీశారు. ఈ సిరీస్ లో సందీప్ కిషన్‌కు తండ్రిగా మురళీశర్మ నటించారు. బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
