తెలుగు సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా వి ఎఫ్ ఎక్స్ పరంగా అప్పట్లోనే మంచి స్టాండర్డ్స్ సెట్ చేసిన సినిమా ‘అమ్మోరు'(Ammoru) ని తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మాణం వహించిన ఈ డివోషనల్ ఎపిక్ చిత్రం మళ్ళీ తెలుగు ప్రేక్షకులని అలరించేందుకు ఈసారి బుల్లి తెర మీదకు ధారావాహికగా రాబోతుంది.
అంతే అత్యున్నత ప్రమాణ విలువలు గ్రాండ్ విజువల్స్ మరియు తారాగణంతో వైభవంగా ఈ సీరియల్ ని ప్రెజెంట్ చేస్తూ వచ్చిన ప్రోమో కట్ తెలుగు ఆడియెన్స్ నుంచి మన్ననలు పొందుతుంది. అప్పటి అమ్మోరు కాన్సెప్ట్ తాలూకా సోల్ ని ఏమాత్రం పక్కదారి పట్టించకుండా దానికి కొనసాగింపుగా బుల్లితెర ఆడియెన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే విధమైన ఎలిమెంట్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్ తో ఈ ప్రోమో అద్భుతంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా ప్రోమో లోని చివరి కొన్ని క్షణాలు తెలుగు ప్రేక్షకులని అలా మళ్ళీ ఎన్నో ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాయి. దీనితో ఈ ధారావాహికని చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ డివోషనల్ సీరియల్ ని ఈటీవీ వారు ఈ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటల 30 నిమిషాలకి టెలికాస్ట్ కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ కి బద్దలయ్యే టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు ఆ బిగ్ డే కోసం ఆగి చూడాల్సిందే.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
