రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు యదార్ధ ఘటనల ఆధారిత చిత్రాల్లో నటుడు శివాజీ, నందు అలాగే నవదీప్ ల కలయికలో దర్శకుడు మురళీకాంత్ దేవాసోత్ తెరకెక్కించిన హార్డ్ హిట్టింగ్ డ్రామా “దండోరా” కూడా ఒకటి. మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఈ సినిమా నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. దీనితో ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఇప్పుడు ఇందులో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించగా రవీంద్ర బెనర్జీ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
