అందరికీ అందుబాటులో “ఓటిటి వాచ్ లిస్ట్ యాప్”

Published on Jul 7, 2021 10:18 pm IST

ప్రస్తుతం ఆన్లైన్ వేదిక గా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి రోజూ మనం ఏదో ఒక కొత్త ఓటిటి గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఓటిటి వాచ్ లిస్ట్ యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే మొత్తం 170 కి పైగా ఓటిటి ప్లాట్ ఫామ్ ల కోసం ఇది అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో స్ట్రీమింగ్ కి సంబందించిన తేదీలు, సమీక్షలు మరియు సమాచారం ట్రాక్ చేయడానికి ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. అయితే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అమితంగా ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. అయితే స్ట్రీమింగ్ లో ఏవైతే ఉన్నాయో నచ్చిన వాటిని వాచ్ లిస్ట్ లో జోడించడం వీలు అవుతుంది. అయితే ఇది ఒక గైడ్ లా పని చేస్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :