మొత్తంగా “దేవర” తో తారక్ సెన్సేషనల్ బిజినెస్.!

మొత్తంగా “దేవర” తో తారక్ సెన్సేషనల్ బిజినెస్.!

Published on Apr 17, 2024 4:12 PM IST


టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర” (Jr NTR Devara) కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా రీసెంట్ గానే ఈ చిత్రం బిజినెస్ పై తెలుగు రాష్ట్రాలు సంబంధించి తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ని ఈ చిత్రం సెట్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు దేవర వరల్డ్ వైడ్ బిజినెస్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా వినిపిస్తుంది.

మరి ఈ బజ్ ప్రకారం దేవర థియేట్రికల్ సహా నాన్ థియేట్రికల్ హక్కులు అన్నీ కలుపుకొని ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ తెలుగు స్టేట్స్, ఓటిటి హక్కులే 270 కోట్లకి పైగానే అని వినికిడి. ఇక మిగతా భాషలు, ఓవర్సీస్ సహా ఆడియో అన్నీ కలిపి ఈజీగా 130 కోట్లు ఉంటుంది అని ఇలా దేవర తో తారక్ అయితే మాసివ్ బిజినెస్ ని చేసినట్టుగా టాక్. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు కలయికలో సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు