
మొదటివారంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా బాహుబలి. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ బాహుబలి అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. తెర మీద నుంచి మన కళ్ళు తిప్పితే ఏం మిస్ అయిపోతామో అనిపించెంతలా ఉన్న భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇన్ని అనుభవాలను అందిస్తున్న బాహుబలి సినిమా ఇంకా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.
ఒక్క ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా 6 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. కానీ ఈ 6 మిలియన్ కలెక్ట్ చేసింది తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనే ఎందుకంటే జూలై 10న హిందీ వెర్షన్ బాహుబలి రిలీజ్ కాలేదు. తాజాగా ఈ చిత్ర మేకర్స్ బాహుబలి సినిమా హిందీ వెర్షన్ ని జూలై 24న యుఎస్ లో రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు. మరి రెండు వారల తర్వాత రిలీజ్ కాబోయే బాహుబలి హిందీ వెర్షన్ కూడా రికార్డ్స్ కొల్లగొడుతుందేమో చూడాలి.
మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ఆంధ్ర – తెలంగాణలో కలుపుకొని మొదటి వారంలో 60 కోట్ల షేర్ సాధించింది.

