‘సైరా’ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేస్తుందట

‘సైరా’ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేస్తుందట

Published on Sep 16, 2019 11:11 PM IST

Syeraa3

మెగాస్టార్ చిరంజవి నటించిన ‘సైరా’ విడుదల సన్నహాల్లో ఉంది. ఈ నెల 18వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు టీమ్. ఈ ట్రైలర్ మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ట్రైలర్ బయటికొస్తుందా చూద్దామా అని ఆశగా చూస్తున్నారు. కొందరైతే విడుదలకు ముందే ట్రైలర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు.

సినీ వర్గాల సమాచారం మేరకు ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. ట్రైలర్ హిందీ వెర్షన్ కట్ ను సెన్సార్ పనుల నిమిత్తం అక్కడి నిర్మాతలకు పంపారట టీమ్. అ కట్ చూసిన వారు చాలా బాగుందని, ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మరి హిందీ వెర్షనే ఇలా ఉంటే తెలుగు ట్రైలర్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇకపోతే 18న జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్, రాజమౌళి, వినాయక్, కొరటాల శివలు ముఖ్య అటిధులుగా హాజరుకానున్నారు. సుమారు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు