“ఓయ్” రీరిలీజ్ కి సిద్ధార్థ్.. దర్శకుడు స్పెషల్ అప్డేట్.!

“ఓయ్” రీరిలీజ్ కి సిద్ధార్థ్.. దర్శకుడు స్పెషల్ అప్డేట్.!

Published on Feb 15, 2024 1:35 PM IST


లేటెస్ట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో అదరగొడుతున్న రీ రిలీజ్ చిత్రం “ఓయ్”. టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా దర్శకుడు ఆనంద్ రంగ తెరకెక్కించిన ఈ క్లాసిక్ హిట్ చిత్రం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత థియేటర్స్ లోకి వచ్చి మంచి ఆదరణను అందుకోవడంతో దర్శకుడు అండ్ టీం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తెలుగు యువత ఈ సినిమాకి ఇచ్చిన విశేష స్పందనతో దర్శకుడు ఆనంద్ రంగ ఒక స్పెషల్ అప్డేట్ ని అయితే అందించాడు. దీనితో రేపు ఫిబ్రవరి 16 శుక్రవారం సాయంత్రం ఓ స్పెషల్ షో చూసేందుకు సిద్ధార్థ్ రాబోతున్నాడు అని అందుకే ఎక్కడైతే ఎక్కువ ఆడియెన్స్ వస్తారో అక్కడకి సిద్ధార్థ్ ని తీసుకొస్తానని తెలిపాడు.

దీనితో అంతా కలిసి ఓయ్ రీరిలీజ్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. మరి నార్మల్ గానే ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక సిద్ధార్థ్ తో కలిసి అంటే మళ్ళీ సిద్ధార్థ్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసే మూమెంట్ గా అది మారుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు