ఓటిటి సమీక్ష: ‘పాణి గ్రహణం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘పాణి గ్రహణం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

Published on Mar 2, 2026 10:48 AM IST

Paani Grahanam

ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మార్చి 1, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : మోహిత్ పెడాడ, నాగసాయి, దేవి శ్రీ కైప, ప్రభావతి, శ్రీధర్ రెడ్డి నల్ల, దయానంద్ కె, అంజి వల్గుమాన్.
దర్శకత్వం : సురేష్ నరెడ్ల
నిర్మాతలు : కంభంపాటి విజయ్ కుమార్, కంభంపాటి స్రవంతి.
సంగీతం : రాకేష్ వెంకటాపురం
ఛాయాగ్రహణం : యశ్వంత్ సి ఉల్లపల్లి
కూర్పు : సాంబశివరావు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ నుంచి రిలీజ్ కి వచ్చిన వీక్లీ సిరీస్ కథా సుధా నుంచి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘పాణి గ్రహణం’. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తమ ప్రేమ గెలిపించుకోడానికి పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇద్దరు యువతీ యువకులు శివ (మోహిత్ పేడాడ), సంధ్య (దేవి శ్రీ కైప) లు పోలీసులు సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. కానీ అదే స్టేషన్ లో తన కూతుర్ని చేసుకున్నాడనే కోపంతో క్షుద్ర పూజలు తెలిసిన బొట్టు కాశీగా పిలవబడే కాశీ (నల్ల శ్రీధర్ రెడ్డి) శివని చంపేస్తానని సవాలు చేస్తాడు. దీనితో ఆ పెళ్లి వల్లే శివ తల్లి గంగవ్వ తన కొడుకుకి ఏమైపోతుందో అని భయం పెట్టుకుంటుంది. మరి ఈ క్రమంలో ఆమె ఏం చేసింది? తన కోడలి వల్లే కొడుకు ప్రాణాల మీదకి వచ్చింది అని బలంగా నమ్మేసిన ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? వాటి వల్ల ఎదురైన పరిణామాలు ఏంటి అనేది ఈ లఘు చిత్రంలో వృత్తాంతం.

ప్లస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో కాన్సెప్ట్ ఈ కథా సుధలో వచ్చిన వాటికి భిన్నంగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మొదటి కొన్ని నిమిషాలు కూడా చూసే వీక్షకుల్లో ఒకరకమైన థ్రిల్ ఏర్పడుతుంది. అలాగే నటి ప్రభావతి ఈ సినిమాలో బాగా చేశారు. తన కొడుకు కోసం పడే తాపత్రయం, అమాయకత్వం, ఒక మూర్ఖపు ప్రేమని ఆమె ప్రదర్శించిన విధానం బాగున్నాయి.

అలాగే యువ నటీనటులు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి బాగా చేశారు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఇందులో బాగున్నాయి. అలాగే కొన్ని మూఢ నమ్మకాలు వాటిని నమ్మడం వల్ల జరిగే నష్టాలు కోసం డైరెక్ట్ గా సందేశం ఇవ్వకపోయినా పరోక్షంగా ఇందులో కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఒక ఇంట్రెస్టింగ్ నోట్ లోనే మొదలైన ఈ చిత్రం తర్వాత మాత్రం పలుచగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఒక తల్లి చూపించే ప్రేమకి కొలమానం ఉండదు కానీ అతిప్రేమ అనేది ఎవరికైనా కొంచెం ఎబ్బెట్టు గానే అనిపిస్తుంది. ఇందులో కూడా అదే చూపించారు. ఇది అందరికీ ఒకే విధంగా కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం.

తన కోడలి పట్ల అంత ద్వేషం చూపించాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది వీటితో చూసే ఆడియెన్ ఈ సబ్జెక్టుకి ఒకింత పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఏమంత థ్రిల్ చేసే రేంజ్ లో అనిపించదు. బొట్టు కాశీ రోల్ ని అంత స్ట్రాంగ్ గా మొదట చూపించి తర్వాత తన రోల్ ని సింపుల్ గా చూపించేయడం మరో మైనస్ గా అనిపిస్తుంది.

ఈ లఘు చిత్రం కంటెంట్ లో మంచి థ్రిల్ అంశాలు ఉన్నాయి. వాటిని అలాగే ఎమోషన్ ని కూడా ఇంకొంచెం బ్యాలెన్సుడ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే నటుడు శ్రీధర్ రెడ్డి నల్ల మొదట తన రోల్ లో బాగానే చేశారు కానీ తర్వాత సీన్స్ లో సహజత్వం లోపించినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సంగీతం, కెమెరా వర్క్ లు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే కానీ ఇంకొంచెం ఫాస్ట్ గా నడిపించాల్సింది. ఇక దర్శకుడు సురేష్ నరెడ్ల విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న లైన్ లో మంచి విషయం ఉంది. కానీ దీనిని ఇంకా బెటర్ వే లో ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. మొదటి కొన్ని నిమిషాలు, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంకొంత డిటైలింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘పాణి గ్రహణం’ అనే లఘు చిత్రంలో కొన్ని అంశాలు ఓకే అనిపిస్తాయి కానీ మరికొన్ని అంశాలు అన్ని వర్గాల ఆడియెన్స్ కి ఆకట్టుకోకపోవచ్చు. స్టార్టింగ్ లో కనిపించిన మూమెంటం ఆద్యంతం సాగలేదు. వీటితో ఈ లఘు చిత్రం కేవలం కొంత మేర ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు