సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా

సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా

Published on Apr 20, 2024 3:01 AM IST
Paarijatha Parvam Movie Review in Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: చైతన్య రావు, మాళవిక సతీశన్, సునీల్, శ్రద్ధా దాస్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్

దర్శకుడు: సంతోష్ కంభంపాటి

నిర్మాత: మహీధర్ రెడ్డి, దేవేష్

సంగీత దర్శకుడు: రీ

సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి

ఎడిటింగ్: శశాంక్ వుప్పుటూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు చైతన్య రావు హీరోగా వైవా హర్ష, శ్రద్దా దాస్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలో వచ్చిన కిడ్నాప్ డ్రామా “పారిజాత పర్వం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే.. చైతన్య (చైతన్య రావు) తన ఫ్రెండ్ హర్ష(హర్ష చెముడు) ని హీరోగా ఒక రియల్ స్టోరీని డైరెక్ట్ చేయాలని బలంగా ఫిక్స్ అవుతాడు. అలాగే మరో పక్క ఓ డాన్ బార్ శీను(సునీల్) ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చి డాన్ గా మారతాడు. అయితే తన మొదటి సినిమా హర్ష తోనే చేయాలి అని ఫిక్స్ అయ్యిన చైతన్య చాలా నిర్మాతలని కలుస్తూ ఉంటాడు అలా ప్రొడ్యూసర్ శెట్టి(శ్రీకాంత్ అయ్యంగర్) ని కూడా కలుస్తాడు కానీ వాళ్ళని అతను తీవ్రంగా అవమానించడంతో చైతన్య, హర్షలు ఏం చేస్తారు? ఈ క్రమంలో బార్ శీను కి చైతన్య ఉన్న కనెక్షన్ ఏంటి? అలాగే పార్వతి(శ్రద్దా దాస్) పాత్రకి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? అనే ఇతర అంశాలకి సమాధానాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

మొదటగా నటీనటుల కోసం చూసినట్టు అయితే కీడా కోలా తర్వాత చైతన్య రావు తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. మరి ఈ సినిమాలో కూడా తన డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటాడు. మంచి లుక్స్ అలాగే తన కామెడీ టైమింగ్ లు ఈ సినిమాలో బాగున్నాయి. అలాగే హీరోయిన్ మాళవిక సతీషన్ కూడా ఆకట్టుకుంటుంది చైతన్య రావు కి తన మధ్య కెమిస్ట్రీ బాగుంది.

ఇంకా వైవా హర్ష మరోసారి తన కామెడీ టైమింగ్ సినిమాలో చూపిస్తాడు. శ్రద్ధ దాస్, చైతన్యరావు మధ్య కొన్ని సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. అలాగే హీరోయిన్ తో ఓ కార్ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంటుంది. ఇంకా సునీల్ కూడా మంచి షేడ్స్ లో కనిపించారు. వీరితో పాటుగా శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా రెండున్నర గంటల లోపే అయినప్పటికీ కొన్ని చోట్ల నరేషన్ బాగా డల్ గా సాగదీతగా ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా సాగుతుంది అని చెప్పాలి. సినిమాలో చాలా రొటీన్ ప్లాట్ కనిపిస్తుంది. దీనితో ఎలాంటి కొత్తదనం కనిపించదు పోనీ కథనం అయినా ఇంప్రెసివ్ గా ఉంటుందా అనుకుంటే అది కూడా కనిపించదు. ఏవో అక్కడక్కడా కొన్ని కామెడీ లైన్స్ తప్ప సినిమా అంతా చాలా బోర్ ఫీల్ కలిగించక మానదు.

ఇది ప్రథమార్ధం, ద్వితీయార్ధంలో కూడా కొనసాగుతుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులే ఉన్నారు కానీ ఆ సిల్లీ కథా కథనాలతో వారి ఎఫర్ట్స్ వృథా అయ్యాయని చెప్పక తప్పదు. ఈ తరహా కిడ్నాప్ డ్రామాలు కథనాలు ఇది వరకే ఎన్నో చిత్రాల్లో చూసిందే ఈ సినిమాలో కూడా చూపించారు. దీనితో ఈ సినిమా అంత ఎగ్జైట్మెంట్ ని కానీ ఆసక్తిని కానీ రేకెత్తించలేదు.

అలాగే చాలా లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. ఇంకా సునీల్ పాత్రని డిజైన్ చేయడంలో లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. దీంతో తన రోల్ మరింత సిల్లీగా కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ పాత్రకి కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ కనిపించదు. శ్రద్దా దాస్ రోల్ కూడా సో సో గానే ఉంటుంది. ప్రాపర్ ఎమోషన్స్ కూడా సినిమాలో లోపించాయి.

 

సాంకేతిక వర్గం :

సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక టెక్నికల్ టీంలో బాల సరస్వతి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది అలాగే శశాంక్ ఉప్పుటూరి ఎడిటింగ్ ఓకే కానీ కొన్ని సీన్స్ ని కట్ చెయ్యాల్సింది. ఇక మెయిన్ గా సంగీత దర్శకుడు రీ ఇచ్చిన పాటలు పర్వాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రతి సీన్ లో రిపీటెడ్ గా చికాకు తెప్పించేలా అనిపిస్తుంది.

ఇక దర్శకుడు సంతోష్ కంభంపాటి విషయానికి వస్తే.. తాను ఈ చిత్రానికి చాలా బిలో యావరేజ్ వర్క్ అందించారు అని చెప్పాలి. చాలా రోటీన్ లైన్ ని తీసుకున్నారు పోనీ ఆసక్తికర కథనం అయినా ఉంటుందా అంటే అది కూడా లేదు. మంచి కాస్ట్ ని పెట్టుకొని ఇంకా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో బెటర్ గా ఈ కిడ్నాప్ డ్రామాని డిజైన్ చేయాల్సింది. ఇది వరకే చూసేసిన ఎన్నో క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ లానే ఇది కూడా చాలా సిల్లీగా ఉంటుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పారిజాత పర్వం” లో కొన్ని కామెడీ సీన్స్ మెయిన్ లీడ్ నడుమ కొన్ని ఫన్ మూమెంట్స్ తప్ప ఇక చెప్పుకోడానికి పెద్దగా విషయం లేదు. మెయిన్ గా సినిమాలో సరైన కథ, కథనాలు బాగా లోపించాయి. బోర్ గా సాగే సిల్లీ కథనం పాత్రల్లో, లోపాలు వంటివి ఈ సినిమాని అంత ఎంగేజింగ్ గా మార్చలేకపోయాయి. వీటితో అయితే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయడం మంచిది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు