పద్మ పురస్కారాలు.. సినీ పద్మాలు వీళ్లే !

padma

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం వేళ పద్మ పురస్కారాలను తాజాగా ప్రకటించింది. కళలు ముఖ్యంగా సినీ రంగంలో విశేష కృషి చేసిన పలువురు పద్మ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు భారతీయ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్‌ (మరణానంతరం) కేంద్రం ప్రకటించింది. మలయాళ హీరో మమ్ముట్టికి మలయాళ సినీ రంగానికి ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించింది.

కేవలం నటన మాత్రమే కాదు. ప్రజల్లో విద్య, ఆరోగ్య విషయాల్లో అవగాహన కల్పించడానికి మమ్ముట్టి తన వంతు కృషి చేస్తున్నందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. అలాగే మన తెలుగు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ కి కూడా పద్మ కిరీటం వరించింది. అదే విధంగా సీనియర్ నటుడు మురళీ మోహన్‌ కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆరు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించారు. ఆయనకు కూడా పద్మం వరించింది.

Exit mobile version