ఏప్రిల్ 11 న విడుదల కాబోతున్న’పైసా’ ఆడియో??

ఏప్రిల్ 11 న విడుదల కాబోతున్న’పైసా’ ఆడియో??

Published on Mar 21, 2013 8:38 PM IST

Paisa

నాని ‘పైసా’ చిత్రం వేసవిలో విడుదల కోసం సిద్ధం అవుతుంది . కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాథరిన్ త్రేస, సిధిక ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని నిర్మించారు .కొంచం ప్యాచ్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఉగాది కానుకగా ఈ చిత్ర ఆడియో ని ఏప్రిల్ 11 న విడుదల చెయ్యనున్నారని వినికిడి.

నాని డబ్బు పిచ్చి గల ప్ర ‘క్యాష్’ అనే పాత్ర పోషిస్తుండగా కాథరిన్ త్రేస నూర్ అనే ముస్లిం యువతి పాత్ర పోషిస్తుంది. అధిక మొత్తం షూటింగ్ హైదరాబాద్లో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని పాటలు మాత్రం దుబాయ్ మరియు మలేషియాలో చిత్రించారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మానవతావిలువల కన్న డబ్బే మన జీవితంలో చాలా ముఖ్యం అనే రాజకీయ ఇతివృత్తంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ‘ఎటో వెళ్లి పోయింది మనసు’ తర్వాత నానికి ఇది చాలా పెద్ద చిత్రం. ఈ చిత్రం తర్వాత సముద్ర ఖని ‘జెండా పై కపిరాజు ‘లో కనిపించనున్నాడు. ‘బ్యాండ్ బాజా బారత్ ‘ చిత్రం షూటింగ్ మొదలు కావాల్సివుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు