ఈనెల 6న విడుదలౌతున్న ‘పంచమి’

ఈనెల 6న విడుదలౌతున్న ‘పంచమి’

Published on Mar 3, 2015 3:37 PM IST

archana
ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై అర్చన ఏకపాత్రాభినయంతో నటించిన సినిమా.. ‘పంచమి’. డి. శ్రీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుజాత బౌరియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఈనెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. అర్చన అందచందాలు, నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

సినీపరిశ్రమలో ఓ కొత్త ఒరవడి సృష్టించే సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఒకే ఒక పాత్రతో నడిచే ఈ సినిమా ప్రేక్షకుణ్ణి మంత్రముగ్ధున్ని చేస్తుందనీ, ఈ సినిమాని చూసిన సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారని చిత్ర యూనిట్ తెలిపింది.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పంచమి.. 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. శ్రీకోటీ సంగీతం వహించిన ఈ సినిమాకు రఘు. ఆర్. భల్లారి సినిమాటోగ్రాఫర్. సుద్దాల అశోక్ తేజ పాటలు సమకూర్చగా, ఎడిటింగ్ కోడెం అజయ్ నిర్వహించారు.

తాజా వార్తలు