
రామ్ నటించనున్న’పండగ చేస్కో’ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించబోతున్నారు.
ఇటివలే దర్శక నిర్మాతలు రకుల్ ప్రీత్ ని ఈ యాక్షన్ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా ప్రకటించారు. ఈ చిత్రం లో ఇంకో హీరోయిన్ కూడ వుండనుందని సమాచారం. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్ చెన్నై లో జరుగుతుండగా రామ్ మరియు గోపీచంద్ మలినేని అక్కడికి వెళ్లారు. థమన్ తన కెరీర్ లోనే మంచి బాణీ లు ఈ చిత్రానికి ఇస్తానని తెలిపాడని సమాచారం. ఈ ఏడాది ‘రేస్ గుర్రం’ లాంటి మంచి హిట్ తో ఊపు మీద వున్న థమన్ తన విజయ పంధాని కొనసాగించాలని చూస్తున్నాడు.
యూరోప్ లో ప్రారంభంకానున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విషయాలు వెలువడాల్సి వుంది.

