సంపత్ నందికి చాలా కీలకం కానున్న ‘పేపర్ బాయ్’

సంపత్ నందికి చాలా కీలకం కానున్న ‘పేపర్ బాయ్’

Published on Aug 19, 2018 6:10 PM IST

దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రొమాంటిక్ టచ్ ని ఇవ్వగా మంచి అంచనాలతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే ఈ చిత్రంలో యూత్ ఆకట్టుకున్నే మంచి ప్రేమకథ ఉందట. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని, అలాగే వైవిద్యమైన ఈ ప్రేమ కథ మొత్తం ఓ కొత్త నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

కాగా దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి నిర్మాత బాధ్యతలే కాకుండా కథ కథనం మాటలు కూడా అందించారు. ఈ చిత్ర విజయం సంపత్ నందికి చాలా కీలకం కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ పూర్తిగా సంపత్ నంది మార్క్ తో వస్తుంది కాబట్టి, ఈ చిత్ర ఫలితం కూడా ఆటోమాటిక్ గా సపంత్ ఖాతాలోకే వెళ్ళిపోతుంది. అందుకే ఈ చిత్రం ఆయన టాలెంట్ కు పరీక్ష లాంటిది. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ రైటర్ ఏం చేస్తాడో చూడాలి. భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు