తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు శివకార్తికేయన్ రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా ఉండబోదని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ఈ మూవీలోని ఇంటర్వెల్ గతంలో వచ్చిన రజినీకాంత్ ‘భాషా’ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్‌లా ఉంటుందని నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
దీంతో ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండబోతుందా.. భాషా రేంజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మరోసారి చూసే అవకాశం నిజంగా ఉందా..? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా రవి మోహన్, అథర్వ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
