“సర్కారు వారి పాట”కు వీరిని లాక్ చేసిన పరశురామ్.?

Published on Sep 19, 2020 11:14 am IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు భారీ హిట్లు తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తుండడం, అలాగే ప్రీ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ లకు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ కు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ లోపల దర్శకుడు పలు అంశాలకు సంబంధించి కూడా కీ డెసిషన్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ విషయంలో ఆలోచనలో ఉన్న దర్శకుడు ఈ చిత్రానికి మన టాలీవుడ్ ఫేమస్ యాక్షన్ స్టంట్ మేకర్స్ రామ్ లక్ష్మణ్ లను లాక్ చేసినట్టు తెలుస్తుంది.

పూర్తిగా వారే ఈ చిత్రంలోకి సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. అలాగే ఈ చిత్రంలో మాస్ పల్స్ మరియు మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఫైట్ సీక్వెన్స్ లను స్టైలిష్ గా తెరకెక్కించనున్నట్టు వినికిడి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More