ఆ ఛాలెంజ్ కోసం నితిన్ ఏమి చేసాడంటే?

ఆ ఛాలెంజ్ కోసం నితిన్ ఏమి చేసాడంటే?

Published on Jul 24, 2019 1:08 PM IST

హీరో నితిన్ ఓ ఛాలెంజ్ లో భాగంగా సామాజిక బాధ్యత నెరవేర్చారు. ఆయన నేడు కొన్ని మొక్కలు నాటడటం ద్వారా ఆ బాధ్యత నెరవేర్చారు. అసలు విషయం ఏమిటంటే తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు కేటీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. కాగా కేటీఆర్ నాకు శుభాకాంక్షలు చెప్పడం కొరకు అనవసర ఖర్చులు చేయకుండా, ఆ చేసేదేమైనా సమాజానికి ఉపయోగపడేలా చేయండి, నాకు గిఫ్ట్ గా ఒక స్మైల్ చాలు అని అభిమానులకు,పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దానితో ఆయన పార్టీ నేతలు,అభిమానులు ఈ “గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్” తీసుకొని అన్నదానం,రక్తదానం,మొక్కలు పెంచడం వంటి సామజిక కార్యక్రమాలు చేపట్టారు.

హీరో నితిన్ తెరాస రాజ్యసభ సభ్యుడైన సంతోష్ కుమార్ స్పూర్తితో మొక్కలు నాటి, ఇలాంటి సామజిక బాధ్యతలో భాగస్థుడిని చేసినందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. నితిన్ ప్రస్తుతం రంగ్ దే, బీష్మ చిత్రాలతో పాటు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు