దాదాపు 10 ఏళ్ళ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ ఇచ్చిన సినిమా ‘పటాస్’. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. తెలుగులో పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. తమిళంలో ప్రముఖ నిర్మాత ఆర్. బి చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మొదట జీవని అనుకున్నా ఫైనల్ గా రాఘవ లారెన్స్ ని ఎంపిక చేసారు.
అలాగే ఈ సినిమా తమిళ వెర్షన్ కి ‘మొట్ట శివ కెట్ట శివ’ అనే పేరుని ఫిక్స్ చేసారు. నిన్నటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. కళ్యాణ్ రామ్ పాత్రలో రాఘవ లారెన్స్ కనిపిస్తుంటే, సాయి కుమార్ పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నాడు. తమిళ్ అనేతివితీకి తగ్గట్టు కథని మార్చి శ్రీ రమణి ఈ సినిమాకి దర్శకత్వం చేయనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నుంచి రెగ్యులర్ గా షూటింగ్ చేసి సినిమాని ఫినిష్ చేయనున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు.
