భారీ రేటుకి అమ్ముడుపోయిన ‘పటాస్’ శాటిలైట్ రైట్స్

భారీ రేటుకి అమ్ముడుపోయిన ‘పటాస్’ శాటిలైట్ రైట్స్

Published on Feb 3, 2015 4:19 PM IST

pataas-audio-review
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ ‘పటాస్’ రూపంలో వచ్చింది. దాంతో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతని టీం చాలా చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా ఇరు రాష్ట్రాల్లో ఈ చిత్ర టీం విజయ యాత్ర నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పటాస్ విడుదలైన అన్ని చోట్లా హౌసె ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓవరాల్ గా 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.

ఈ పటాస్ సినిమా థియేటర్స్ లోనే కాకుండా బుల్లితెర శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా రికార్డ్ స్థాయి రేటుకి అమ్ముడు పోయింది. బాగా టఫ్ గా జరిగిన కాంపిటీషన్ లో జీ తెలుగు వారు పటాస్ సినిమా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. సుమారు 4 కోట్లకి పైనే పటాస్ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎంటర్టైన్మెంట్ గా సాగడం ఈ సినిమాకి ప్రధాన బలం. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు