
ఈ ఏడాది ప్రారంభంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘పటాస్’ను ఇతర భాషలలో రీమేక్ చేయడం కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరికి చెందిన మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఆర్.బి.చౌదరి కుమారుడు జీవా ‘పటాస్’ తమిళ రీమేక్లో హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతుంది.
నందమూరి కళ్యాణ్ రామ్, శృతి సోది జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కామెడీకి మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి, తొలి సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ సాదించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టిగా పేలింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకొచ్చింది.