మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న యునిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘భగ భగ’ అనే పవర్ ఫుల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. దేశభక్తిని రగిలించేలా ఉన్న ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్జ్ స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయకుడు కాల భైరవ తనదైన శైలిలో ఉద్వేగభరితంగా ఆలపించారు.
రచయిత రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు ప్రధాన బలంగా నిలిచింది. పదాలను ఆయుధాలుగా మలిచి రాసిన లిరిక్స్ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ లోని యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సురేష్ రగుతు ఛాయాగ్రహణం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
