సైరా కొరకు పవన్ మరో మారు…!

సైరా కొరకు పవన్ మరో మారు…!

Published on Sep 19, 2019 9:30 AM IST

నిన్న విడుదలైన సైరా ట్రైలర్ విశేష స్పందన దక్కించుకోవడంతో పాటు, యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధిస్తూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో నిన్న నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి మీడియాతో ఇంటరాక్ట్ అవడంతో పాటు, పాత్రికేయులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వారిలో ఒకరు సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఓవర్ ఉంది కదా, మరి మూవీలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందా అని అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా చరణ్ కొంచెం సందేహిస్తూనే అవునని సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సైరా మూవీ లో కూడా ఉంటుందన్న సమాచారంతో పవన్ ప్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సైరా టీజర్ కి పవన్ వాయిస్ ఓవర్ చాలా మేలైంది అనడంలో సందేహం లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో వచ్చే నెల 2న విడుదలవుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు