ఈ రికార్డ్స్ పంచుకున్న పవన్,మహేష్.!

Published on Jun 3, 2020 11:18 pm IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు ఉన్న క్రేజ్ కోసం కానీ బాక్సాఫీస్ స్టామినా కోసం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే వీరిద్దరి నడుమ మంచి రసవత్తరమైన పోటీ ఉంటుంది.

అలా ఇప్పుడు వీరిద్దరూ నటిస్తున్న తాజా చిత్రాలు “వకీల్ సాబ్” మరియు “సర్కారు వారి పాట” సినిమాలు సోషల్ మీడియాలో ఒకేలాంటి రికార్డులను అందుకున్నాయి. సినీ పరిశ్రమ వారు అత్యధికంగా వినియోగించే సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ లో తార స్థాయి సెలబ్రేషన్స్ అభిమానులు చేస్తుంటారు.

అలా సర్కారు వారి పాట ప్రీ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ తో ఫాస్టెస్ట్ 50 వేలు రీట్వీట్లు సంపాదించిన పోస్టర్ గా రికార్డు నమోదు చెయ్యగా దీనితో పాటు పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మొట్ట మొదటిగా 50 వేలు రీట్వీట్స్ దాటిన పోస్టర్ గా రికార్డు క్రియేట్ చేసింది.

దీనితో ఈ రెండు రికార్డులు కొట్టిన ఫస్ట్ ఎవర్ హీరోలుగా ఈ ఇద్దరు నిలిచారు. వకీల్ సాబ్ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, సర్కారు వారి పాట ను పరశురామ్ తెరకెక్కించనున్నారు. ఈ రెండు చిత్రాలకు థమనే సంగీతం సమకూర్చడం మరో విశేషం.

సంబంధిత సమాచారం :

More