పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న రాత్రి ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇంతకీ పవన్, ప్రకాష్ రాజ్ గురించి ఏమి మాట్లాడాడు అంటే.. ప్రకాష్ రాజ్ గారు గొప్ప నటుడు. రాజకీయంగా మేము వేరు కావొచ్చు.
అలాగే ఆయన నన్ను టీవీల్లో కూర్చుని నన్ను తిట్లు తిట్టి ఉండొచ్చు. కానీ ఒక నటుడిగా నేను ఆయనను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ సినిమాలో ప్రతివాద లాయర్‌గా ప్రకాశరాజ్ నటించడం మరింత వన్నెను చేకూర్చింది. నా పర్పార్మెన్స్ ఈ సినిమాలో బాగుందంటే అందుకు కారణం ప్రకాశ్‌రాజ్ గారే అంటూ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో అల చెప్పడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
దిల్ రాజు నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి నటించడం, అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాల బాగా వచ్చిందని టాక్ రావడంతో ఈ సినిమాకి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రానున్నాయి.
