పవన్ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ కాలేదట ?

Published on May 25, 2020 7:22 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా
దర్శకుడు డాలీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. పవన్ – డాలీ మధ్య సినిమాకి సంబంధించి ఎలాంటి చర్చ కూడా జరగలేదట. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం పవన్ ను అప్రోచ్ అయ్యారని, కానీ పవన్ నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదని తెలుస్తోంది. ఇక పవన్ నుండి వరుసగా రెండు సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More