పవన్ పేరిట మరొక రికార్డ్ క్రియేట్ చేసిన అభిమానులు

పవన్ పేరిట మరొక రికార్డ్ క్రియేట్ చేసిన అభిమానులు

Published on Sep 2, 2019 7:54 PM IST

మన దక్షిణాదిన ఎవరైనా స్టార్ హీరో పుట్టినరోజు వస్తోందంటే ఆ హీరో అభిమానులు పలు రకాలుగా సెలబ్రేట్ చేస్తుంటారు. వాటిలో ట్విట్టర్ ట్రెండింగ్ కూడా ఒకటి. ఈ అంశాన్ని హీరోల అభిమానులు కొంచెం ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటూ తమ హీరో పుట్టినరోజు నాడు అత్యధికంగా ట్వీట్స్ చేసి ఎప్పటికప్పుడు రికార్డ్ నెలకొల్పుతుంటారు.

ఈరోజు సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు ట్విట్టర్ ట్రెండింగ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం నిన్న సాయంత్రం నుండే హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ మీద తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు.

పవన్ ఫ్యాన్ బేస్ భారీ స్థాయిది కావడంతో కేవలం 24 గంటల్లోనే ట్వీట్ల సంఖ్య 10.5 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు అతిపెద్ద బర్త్ డే ట్రెండ్ రికార్డ్ పవన్ పేరిట నమోదైంది. దీన్నిబట్టి సినిమాలు చేయకపోయినా అభిమానుల్లో పవన్ చరీష్మా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు