‘గోపాల గోపాల’కి 20 రోజులు మాత్రమే ఇచ్చిన పవన్ కళ్యాణ్

‘గోపాల గోపాల’కి 20 రోజులు మాత్రమే ఇచ్చిన పవన్ కళ్యాణ్

Published on Jun 16, 2014 12:40 PM IST

Pawan_Kalyan-10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించనున్నాడు. అది కూడా పవన్ పాత్ర రన్ టైం కేవలం 30 నిమిషాలే ఉంటుందని మేము ఇది వరకే తెలియజేశాను. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన పాత్రని షూట్ చేయడం కోసం ఈ చిత్ర టీంకి 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ 20 రోజుల్లోనే పవన్ సీన్స్ ని పూర్తి చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తున్నారు.

వెంకటేష్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించనున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ శరన్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు