‘ఓజి’ కోసం పవన్ రెడీ అట

‘ఓజి’ కోసం పవన్ రెడీ అట

Published on Feb 28, 2024 4:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితం అవుతున్న ఈ మూవీకి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిని సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు ఉండబోదని తెలుస్తోంది. తాజాగా తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఓజి మేకర్స్ కలిశారట. అయితే ఏపీ ఎలక్షన్స్ పూర్తి అయిన అనంతరం తన బ్యాలన్స్ షూట్ వర్క్ కి సంబంధించి వెంటనే ఓజికి కాల్షీట్స్ ని ఇస్తానని పవన్ మాటిచ్చారని అంటున్నారు. దీనిని బట్టి పక్కాగా ఓజి మూవీ తాము ప్రకటించిన మేరకు పక్కాగా అదే తేదీన థియేటర్స్ లో ఉంటుందని మేకర్స్ మరొక్కసారి కన్ఫర్మ్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు